ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి ఆద్యుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నాయకత్వంలోనే భారతదేశం సాంకేతిక రంగంలో కొత్తపుంతలు తొక్కిందని గుర్తుచేశారు. "కంప్యూటర్, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి, నేటి తరానికి మొబైల్ ఫోన్ల సౌకర్యం అందేలా చేసినది రాజీవ్ గాంధీ గారి దూరదృష్టి. దేశంలో కంప్యూటర్ యుగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనద