తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తమై మరో ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో అధికారులు హాలిడే ఇచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇప్పటికే పలు జిల్లాల్లో సెలవులు అమల్లో ఉన్నాయి. గురువారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. స్కూల్ పిల్లలు ఇంటివద్దనే జాగ్రత్తగా ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో ఎవరు బయటికి రావద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వర్షాలు ఇలానే కురిస్తే విద్యా సంస్థలకు సెలవులను పొడగించే అవకాశం ఉంది.