సైనికులు, మాజీ సైనికుల కొరకు ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్న కోర్టు ద్వారా ఉచితంగా పరిష్కరించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. ఆదిలాబాద్ లోని మాజీ సైనిక సంక్షేమ సంఘం భవనంలో మంగళవారం న్యాయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైనికులకు, మాజీ సైనికులకు ఉన్న న్యాయపరమైన సమస్యలపై చర్చించారు. జిల్లా జడ్జ్ లు కుమార్ వివేక్, లక్ష్మీ కుమారి, డి.ఎల్.ఎస్.ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్ తదితరులు ఉన్నారు