శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ చేతన్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వాటితో పాటు పసుపు కుంకుమ పండ్లను పంపిణీ చేశారు.వినాయక విగ్రహాల కోసం జనం బారులు తీరడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. పాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని, పర్యావరణ పరిరక్షణను కాంక్షించి ప్రతి ఒక్కరూ ఈ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆ దిశగా అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.