శ్రీకాళహస్తిలో స్మార్ట్ కార్డు పంపిణీ శ్రీకాళహస్తిలోని గాంధీ వీధిలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తహశీల్దార్ జనార్దన్ రాజు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. శ్రీకాళహస్తి అర్బన్ పరిధిలో 17,000 స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీటి వలన ఏపీలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉందని వారు ప్రజలకు తెలియజేశారు.