గూడూరు పట్టణంలో వినాయక చవితి వేడుకలు ఐదు రోజులపాటు నిర్వహించుటకు గతంలోనే తీర్మానం చేసుకుందామని, గ్రామ కట్టుబాట్లు, హిందువుల ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రజలు సంతోషాల మధ్య వేడుకలు జరుపుకుంటున్నామని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు. గురువారం ఆర్ఎస్ఎస్ గ్రామ వికాస సమితి విభాగ్ డమాం సురేష్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ రాజేష్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు, గోరక్ష ప్రముఖ్ శంకర్ మాట్లాడారు. ఐదు రోజులకు నిమజ్జనం జరుగుతుందని వదంతులు నమ్మవద్దని వారు కోరారు.