అవగాహనతో కూడిన పాలన చేస్తే జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజావేదిక టిడిపి కార్యాలయంలో గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో ఏడాది వ్యవధిలోనే16వేల,437 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుందన్నారు.