కర్నూలు జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సాయంత్రం 5 గంటలకు సబ్ కలెక్టర్ ఆర్డీవోలు తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు,మద్దికెర, చిప్పగిరి, హాలహర్వి, నందవరం, పెద్ద కడుబూరు మండలాల్లో వర్షం అధికంగా కురిసిందని, రాబోయే సి.బెలగల్, గూడూరు, చిప్పగిరి మండలాల్లో వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని, ఆయా మండలాల అధికారులు అప్రమత