విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నాగర్కర్నూల్ ఎస్సై గోవర్ధన్ మంగళవారం తెలిపారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో నాగనోలు గ్రామానికి చెందిన నరసింహ (60) గత నెల 11న విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.