రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు శనివారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల జాబితాపై చర్చించారు. అలాగే ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష నాయకుల నుంచి అధికారులు సూచనలు,సలహాలు తీసుకున్నారు. ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.