రైతులకు యూరియాను పంపిణీ చేయలేమని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు నిరసన చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పంపిణీలోని సమస్యలు, ఒత్తిళ్లపై ఆయనకు చెప్పారు. పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు.