Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గణపురం మండలం మదనపల్లి గ్రామం చెందిన రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల వరి పంట నీటమునిగినట్లు రైతులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు ధర్మారావుపేట చెరువు లోని నీరు ముసర్లకుంట చెరువులోకి చేరడంతో ఒక్కసారిగా ముసర్లకుంట చుట్టు ఉన్న 60 ఎకరాల వరి పంట నీట మునిగిందని, ఇదే క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గుట్టల నుంచి నీరు పంటల్లోకి చేరడం వల్ల కూడా నష్టం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు రైతులు.