నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. భాను ప్రకాష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాను ప్రకాష్ ప్రస్తుతం ఈసీఈ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. బ్రాను ప్రకాష్ సొంత ఊరు కడప జిల్లా పులివెందుల గ్రామం పోలీసులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి నంద్యాల ఏఎస్పి మంద జావలి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు