జిల్లాలో కురిసిన అధిక వర్షాల వలన జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా రిపోర్ట్ అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, పంచాయతీ, ఆర్ డబ్లూ ఎస్, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో టెలికాన్ట్రెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరదల నియంత్రణకు పరిష్కారం చూడాలని అన్నారు.