కాకినాడజిల్లా తుని మండలం లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు శరన్నవరాత్రుల సందర్భంగా తొలిరోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజు కావడంతో భక్తులు అమ్మవారి సన్నిధానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లలితా సహస్ర పారాయణ కార్యక్రమం గావించారు. దేవస్థానం ఈవో విశ్వనాధ్ రాజు తో పాటు ఉద్యోగులు మూర్తి వేదపండితులు రానిశర్మ తదితరులు పాల్గొన్నారు