స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ,విద్యుత్ చార్జీల కు వ్యతిరేకంగా నేడు ప్రతిజ్ఞ దినంగా ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారుగత 2000 సమవత్సరం హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ సంస్కరణ కోసం పోరాడి కాల్పుల్లో మృతి చెందిన బాలస్వామి, రామకృష్ణ,విష్ణువర్ధన్ రెడ్డి లకు నివాళులు అర్పించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడుతమని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కు బుద్ది చెబుతామని హెచ్చరించారు..