ఉంగుటూరు మండలం చేబ్రోలు సమీపంలో తల్లాపురం మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో, నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన సింగులూరి రామకృష్ణ అనే ట్రాక్టర్ డ్రైవర్ నీటిలో కూరుకుపోయి మృతిచెందాడు. రామకృష్ణ చేపల మేత వేసుకుని గుండుగోలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.