సూర్యాపేట జిల్లా: విజ్ఞాలు తొలగించే దేవుడు వినాయకుడు అని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం కోదాడలోని విజయ గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన ప్రత్యేకమైన పూజలను చేపట్టారు. వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో ప్రశాంత వాతావరణంలో నిర్వాహకులు జరుపుకోవాలని సూచనలను, తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.