నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.లక్ష్మీపతి గౌడ్ అధ్యక్షతన పేట జిల్లా గుండు మాల్ మండలం బోగారం మరియు గుండు మాల్ గ్రామంలో మరియు మద్దూర్ మండల పరిధిలోని దొరేపల్లి గ్రామం, పల్లె గడ్డ తండాలో మంగళవారం 8 గంటల నుండి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. లక్ష్మి పతి గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన పౌరులకు న్యాయ సేవ అధికారి సంస్థ ద్వారా రెండు ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.