సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ గా విశాలాక్షి బదిలీపై వచ్చారు. పట్టణంలోని కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాదులో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పనిచేసి జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి డిప్యూటీ కలెక్టర్గా బదిలీపై వచ్చారు. గతంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన రాజారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. కొన్నాళ్లుగా నిమ్జ్ కార్యాలయంలో అధికారి లేక కార్యకలాపాలు నిమ్మదించాయి . అధికారి రాకతో పనులు వేగవంతం కానున్నాయి.