కిష్టాపూర్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో తాసిల్దార్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. కిష్టాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శివానందం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అంటరానితనం, రెండు గ్లాసుల విధానం, దేవాలయాల ప్రవేశం నిషేధం అనే అంశలపై చర్చించారు. అంటరానితనం కొనసాగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రేమ్ కుమార్, కార్యదర్శి రంగవ్వ, గ్రామస్తులు పాల్గొన్నారు.