లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఈ నెల 9న వరంగల్లో తలపెట్టనున్న లంబాడీల శాంతి ర్యాలీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ కార్యదర్శి హరినాయక్ సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ పలు గిరిజన సంఘాల నేతలు హాజరయ్యారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లంబాడీలను ఏమి చేయలేరని ఇది కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసం కాంగ్రెస్ ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని అన్నారు.