టాటా మ్యాజిక్ ఆటో యజమానులు, డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ IFTU ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ ధర్నాలో IFTU ప్రధాన కార్యదర్శి పోలారి పాల్గొన్నారు.