సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ శివారులో కరెంటు లేకుండానే బోరు బావుల నుంచి నీళ్లు వాటంతటవే.. బయటకు వస్తున్నాయి. పక్షం రోజులుగా కురుస్తున్న జోరు వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా భూగర్భ జలాలు మట్టం భారీగా పెరిగిపోయింది. వ్యవసాయ బావులు జలకలను సంతరించుకుని పైకి చేతికి అందేలా నిండుగా మారాయి. డివిజన్ లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, జరాసంఘం, న్యాల్ కల్ మండలాల్లోని గ్రామాల్లోనూ బోరు బావుల్లోంచి నీరు పైకి ఉబికి వస్తోంది. మోటర్లు స్టార్ట్ చేయకుండా నీరు ఉబికి రావడంతో సాగు చేసిన పంటలు మునిగి దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.