గిరిజనులు సాగులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను గిరిజన రైతులకు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆగూరు రెవెన్యూలో తరతరాల నుంచి గిరిజనులు అటవీ భూములను సాగుచేస్తే జామి మండలానికి చెందిన బండారు సంజీవరావు నకిలీ పత్రాలతో భూములను స్వాహా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. అటవీ అధికారులు గిరిజనులను భయపెడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు న్యాయం చేయాలన్నారు.