మైదుకూరు మండలం చౌటపల్లి గ్రామంలో ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో సమీప పంట పొలాల నుండి వచ్చే నీరు స్మశాన వాటికలోకి చేరి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.గ్రామస్థులు మాట్లాడుతూ –ప్రహరీ గోడను పూర్తిగా నిర్మిస్తే నీరు స్మశాన వాటికలోకి రాదు. మా సమస్యలు తొలుగుతాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.