తనకున్న జెండా,ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి,పేద ప్రజల సంక్షేమం మాత్రమేనని MLA కడియం శ్రీహరి అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఒక్క రఘునాథపల్లి మండలానికే ఎస్సీపి నిధుల ద్వారా ఎస్సి కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి 4కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈజీఎస్ కింద 2కోట్లు మంజూరు అయ్యాయని పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.అలాగే నియోజకవర్గంలోనే ఎక్కువగా రఘునాథపల్లి మండలానికి 561 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని అన్నారు.