ఏ.పి.పి.ఎస్.సి. ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆదిత్య యూనివర్సటి డిప్యూటీ మేడపాటి శ్రీనివాస రెడ్డి ఆదివారం తెలియజేసారు.ఈ పరీక్షల నిర్వహణను పరిశీలించిన ఏ.పి.పి.ఎస్.సి. చైర్మన్ అనురాధ, పెద్దాపురం ఆర్.డి.ఓ. కె.రమణి పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదిత్య విశ్వవిద్యాలయం క్యాంపస్ నందు మొత్తం పది సెంటర్లలో 6648 మంది పరీక్షలు వ్రాయవలసి ఉండగా 5895 మంది హాజరయ్యారు.