నంద్యాల జిల్లా బేతంచర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె గ్రామంలో శుక్రవారం 10 అడుగుల కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులు చెత్తాచెదారాన్ని తొలగిస్తున్న సమయంలో అది కనిపించిందన్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకున్నారు. దానిని అడవుల్లో వదులుతామని చెప్పారు.