బంగారు పాల్యం మండల పరిధిలోని చెన్నై బెంగళూరు ఎక్సప్రెస్ హైవే పనులు చేస్తూ బిర్జి పైనుండి క్రింద పడి మైనర్ బాలుడు మృతి చెందిన కేసులో బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు చిత్తూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనందబాబు కు పిర్యాదు చేయగా శనివారం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు వారి సిబ్బంది బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు,ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో మైనర్ బాలుడు మృతి చెందిన నేర స్థలాన్ని పరిశీలించి స్టేట్ మెంటు రికార్డు చేయడం జరిగిందని తదుపరి చర్యలు తీసుకునేందుకు లేబర్ ఆఫీసర్ రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు