పలాస మండలం శాసనామ్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీష జల్ జీవన్ మిషన్ ద్వారా విడుదలైన రూ. 92.40 లక్షల నిధులతో ఇంటింటికి మంచి నీటి సరఫరా పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు ఆమెకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... దశాబ్దాల కాలంగా గ్రామానికి మంచినీరు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీను నేడు నిలబెట్టుకున్నానని తెలిపారు.