అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిపై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, కైకలూరు ప్రజల కష్టాలను ఎమ్మెల్యే కామినేని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో తిరగడాన్ని బాలకృష్ణ చూడలేకపోతున్నారని, బాలకృష్ణ వల్లే అసెంబ్లీ గేటు వద్ద బ్రీత్ ఎనలైజర్లు పెట్టారని ఆయన ఆరోపించారు.