చెరువులో పడి యువకుడి మృతి పశువులు మేపడానికి వెళ్లిన యువకుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నార్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్ 25సం శుక్రవారం పశువులు మేడపడానికి వెళ్లి చెరువులో గల్లంతయ్యాడు. శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.