దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులూరు చెరువు వద్ద విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినాయకుడి నిమజ్జనంలో భాగంగా శ్రీనివాసు, వెస్లీ ఆటోలో వచ్చారు. ఆటో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని ఆటోను వెళితేశాయి. ఆటోలోనే మృతదేహాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.