షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార సంఘం మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ రాజ వరప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించారన్నారు.