ఆదోని మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి. PPP పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి ఇవ్వకూడదని, ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు లో ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలను మేము అధికారం వస్తే పూర్తి చేస్తామని చెప్పి, అధికారంలో వచ్చిన తర్వాత ప్పైవేటీకరణ చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం చేసి ప్రభుత్వ నిర్వహించాలని డిమాండ్ చేశారు.