జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఆమె సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. పిండా లింగ నిర్ధారణ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.