కోలార్ జిల్లాకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లోనుంచి నెల్లూరుకు వచ్చిన వెంకటేష్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 6 కిలోల గంజాయి దొరికింది. అతని అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేశామని రైల్వే డిఎస్పి మురళీధర్ శనివారం మధ్యాహ్నం మీడియాకు తెలిపారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో కూడా మరో ఇద్దరూ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారని ఆయన వివరించారు.