Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టినట్లు ఆశా వర్కర్ల జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్లకు 18 వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డు, పిఎఫ్,ఈఎస్ఐ తో పాటు 18 డిమాండ్లు నెరవేర్చాలని,ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు పరిష్కరించని యెడల రానున్న రోజుల్లో కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు ఆశ వర్కర్లు.