కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలంలోని తెల్లపాడు సమీపంలోని తెలుగు గంగ కాలువపై మరమ్మత్తులకు నోచుకోక నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకమును శనివారం సిపిఐ నాయకులు, కార్యకర్తలు,ప్రజలతో సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ కలసపాడు మండలంలోని తెల్లపాడు గ్రామ పంచాయతీ లోని తెల్లపాడు, ఎగువ తంబళ్లపల్లె,ఎగువరామాపురం గ్రామపంచాయతీల పరిధిలోని తడుకు చెరువు,తిక్కమ్మ చెరువు, మేలకుంట చెరువు,రంపకుంట చెరువు, దూలవారిపల్లె చెరువు,కొండపేట కొత్తచెరువులకు నీటిని నింపడం కోసం సుమారు 17 కోట్ల రూపాయల చేపట్టిన ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందన్నారు.