మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నీరు విడుదల చేయడంతో గోదావరి తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందస్తు చర్యగా మాత శిశు ఆసుపత్రిలోని బాలింతరాళ్లు, గర్భిణీలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితిని కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పరిశీలించారు.