పల్నాడు జిల్లా అమరావతి మండలం కేంద్రంలో పుణ్యక్షేత్రానికి వినాయక నిమజ్జనం కోసం వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మండల ఎస్సై అమీర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కృష్ణ నది వద్ద మాట్లాడుతూ భక్తులు సౌకర్యార్థం బుద్ధ ప్రాజెక్టు వెనుకవైపు ప్రత్యేకంగా నిమర్జనం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన ఈ ప్రదేశంలో మాత్రమే నిమజ్జనం చేయాలని ఇతర చోట్ల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేశారు.