అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వినాయక మండపాలను తనిఖీ చేసి బైక్‌పై తిరిగి వస్తుండగా దారి మధ్యలో వృద్ధుడు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో కానిస్టేబుల్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.