హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో వెలసిన షేక్షావలి షాషావలి ఉరుసుకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఎండి ఫారుక్ కార్యాలయంలో విడుదల చేశారు. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన షాషావలి 363వ ఉరుసు మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని దర్గా ఈవో ఇమ్రాన్ తెలిపారు. సెప్టెంబర్ 18,19,20 తేదీలలో ఉరుసు మహోత్సవం ఉంటుందన్నారు.