తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఇనగలూరు వద్ద గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి రేణిగుంటలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తికి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు వివరాల్లోకి వెళితే ఆత్మకూరుకు చెందిన అబ్దుల్ ఆత్మకూరు నుండి శ్రీకాళహస్తికి వస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి గత నెల 26వ తేదీ డివైడర్ను ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు మంగళవారం రాత్రి మృతి చెందడంతో బుధవారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రూరల్ పోలీసులు బంధువులకు అప్పగించారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ద్రాక్ష చేపట్టారు