ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మరియు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు వైరల్ ఫీవర్ లు ఎక్కువయ్యాయని హాస్పటల్ సూపర్డెంట్ రామచందర్రావు తెలిపారు. దీంతో వృద్ధులు పిల్లలు జ్వరాలతో హాస్పటల్ కి వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ లో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. డెంగీ మలేరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. వైరల్ ఫీవర్ లు వచ్చిన రోగులకు డెంగీ మలేరియా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.