ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది పగటిపూట అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఒక్కపొద్దుతో ఇబ్బంది పడ్డారు రాత్రికి వాతావరణం మారి బలమైన గాలులతో కూడిన భారీ వర్షం శనివారం రాత్రి 8 గంటల సమయంలో కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాతావరణ చల్లబడి ప్రజలు ఉపశమనం పొందారు.