బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఆళ్లగడ్డలోని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం ఉదయం ఊరేగింపుగా ఈద్గాల వద్దకు వెళ్లారు. ముత్తవల్లి మహమ్మద్ సాధిక్ ఉపన్యాసమిచ్చారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ జరుపుకుంటున్నామన్నారు.