కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నిన్నటి నుంచి రచ్చ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కౌన్సిల్ సమావేశం మొదలు అయిన కొద్దిసేపటికే చైర్ పర్సన్ లక్ష్మీదేవి ఫోన్ చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ స్పందించలేదంటూ.. కమీషనర్ చైర్పర్సన్ కు క్షమాపణ చెప్పాలని వైసిపి కౌన్సిలర్లు నిరసనకు దిగారు. దీంతో సభ మొదలైన కొద్దిసేపటికి సమావేశం నుంచి అధికారులు వెళ్లిపోయారు .సమావేశం జరుగుతుండగా అధికారులకు ఏ విధంగా వెళ్లిపోతారంటూ వైసీపీ కౌన్సిలర్లు నిన్నటి నుంచి కౌన్సిల్ హాల్ లోనే ఉన్నారు. అక్కడికే భోజనాలు తెప్పించుకొని తింటూ కౌన్సిల్ హాల్ లోనే నిద్రపోయారు. బుధవారం కౌన్సిల్ సమావేశం కంటిన్య