రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అవసరమైతే ప్రభుత్వంపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాల నరసింహ పిలుపునిచ్చారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం లక్ష్మణాచారి భవన్ లో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు ముఖ్య అతిథిగా బాల నరసింహ పాల్గొన్నారు